ముస్లింల సంక్షేమానికి వినూత్న పథకాలు
ABN , First Publish Date - 2021-05-06T05:16:04+05:30 IST
దేశంలో ముస్లింల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు.

జిన్నారం, మే 5: దేశంలో ముస్లింల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం శివానగర్‌లో ముస్లింలకు ప్రభుత్వం తరఫున రంజాన్ కానుకలను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అందజేశారు. అనంతరం రూ.5లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ రేఖ, ఎంపీటీసీ సంతోష, నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు పనులకు శంకుస్థాపన
రామచంద్రాపురం(పటాన్‌చెరు): నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్‌చెరు మండలం నందిగామలో రూ. 1.8 కోట్లతో భానూరు వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేస్తున్న ఆర్చీని పరిశీలించారు.
సాకి చెరువు సుందరీకరణ పనుల పరిశీలన
పటాన్‌చెరులో రూ.20 కోట్లతో అభివృద్ధి పరుస్తున్న సాకి చెరువు సుందరీకరణ పనులను బుధవారం ఎమ్మె ల్యే మహిపాల్‌రెడ్డి పరిశీలించారు. ఇటీవల కొందరు స్థా నికులు సాకి చెరువు అభివృద్ధి పనుల్లో అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారంటూ కేసులు నమోదు చేయించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే అధికారులతో సమావేశమయ్యారు. చెరువు పైభాగంలో అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదన్నారు. కోర్టు ధిక్కార కేసుకు సంబంధించిన అంశాన్ని డీసీ బాలయ్య, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు. అక్రమదారుల విషయంలో కఠినంగా వ్యవరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.