కంపెనీలో పెట్టిస్తానని ఇన్నోవాతో పరార్‌

ABN , First Publish Date - 2021-05-20T05:51:46+05:30 IST

: ఇన్నోవా వాహనాన్ని అద్దెకు నడుపుకుంటూ జీవిస్తున్న వ్యక్తికి పరిచయమైన మరో వ్యక్తి కంపెనీలో పెట్టిస్తానంటూ వాహనం తీసుకొని పరారయ్యాడు

కంపెనీలో పెట్టిస్తానని ఇన్నోవాతో పరార్‌

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), మే 19: ఇన్నోవా వాహనాన్ని అద్దెకు నడుపుకుంటూ జీవిస్తున్న వ్యక్తికి పరిచయమైన మరో వ్యక్తి కంపెనీలో పెట్టిస్తానంటూ వాహనం తీసుకొని పరారయ్యాడు. మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌ కథనం ప్రకారం... మనోహరాబాద్‌ మండలం రామాయపల్లికి చెందిన జుట్టు బాబుగౌడ్‌ (ఏపీ 28 సీజే 5868) ఇన్నోవా వాహనాన్ని అద్దెకు నడిపిస్తుంటాడు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ వద్ద సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కలఖానాపూర్‌కు చెందిన డ్రైవర్‌ రామకృష్ణాగౌడ్‌ నాలుగు నెలల క్రితం పరిచయం అయ్యాడు. బాబుగౌడ్‌కు చెందిన ఇన్నోవా వాహనాన్ని ఏదైన కంపెనీలో పెట్టిస్తానంటూ రామకృష్ణాగౌడ్‌ నమ్మకం కలిగించాడు. ఈనెల 9న ఇన్నోవా వాహనాన్ని తీసుకెళ్లి, కనిపించకుండా పోయాడు. మొబైల్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ ఉంది. దీంతో బాబుగౌడ్‌ బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజుగౌడ్‌ వివరించారు. Updated Date - 2021-05-20T05:51:46+05:30 IST