టీఎ్‌సఐసీ పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-10-26T04:49:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ -2021 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అన్నారు.

టీఎ్‌సఐసీ పోస్టర్‌ ఆవిష్కరణ
టీఎ్‌సఐసీ పోస్టర్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి

సిద్దిపేట అగ్రికల్చర్‌, అక్టోబరు 25 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ -2021 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌ సముదాయంలో స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌-2021 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, చెన్నయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంతారావు, జిల్లా సైన్స్‌ అధికారి మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు కలెక్టర్‌ అభినందన

జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులు రామస్వామి, భాస్కర్‌, వెంకటేశ్వర్‌, క్రాంతికుమార్‌, ప్రశాంత్‌కుమార్‌, శ్రీనివా్‌సరెడ్డి సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వెంకట్రామారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్‌ అభినందించారు. 

Updated Date - 2021-10-26T04:49:11+05:30 IST