టీకా తీసుకున్న యువతికి అస్వస్థత

ABN , First Publish Date - 2021-12-08T04:44:19+05:30 IST

కరోనా టీకా తీసుకున్న మరసటి రోజు యువతి అస్వస్థతకు గురైన సంఘటన జగదేవ్‌పూర్‌ మండలంలోని తిగుల్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

టీకా తీసుకున్న యువతికి అస్వస్థత

 జగదేవ్‌పూర్‌, డిసెంబరు 7: కరోనా టీకా తీసుకున్న మరసటి రోజు యువతి అస్వస్థతకు గురైన సంఘటన జగదేవ్‌పూర్‌ మండలంలోని తిగుల్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి 22 ఏళ్ల యువతి సోమవారం మధ్యాహ్నం తీగుల్‌ ప్రాథమిక ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంది. సోమవారం రాత్రి వరకు బాగానే ఉంది. మంగళవారం ఉదయం నోటిమాట రాకపోవడంతో వెంటనే తీగుల్‌ వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సూచన మేరకు ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితిని డిప్యూటీ డీఎంహెచ్‌ శ్రీనివాస్‌, తీగుల్‌ పీహెచ్‌సీ వైద్యురాలు నివేదిత ఆస్పత్రికి వెళ్లి తెలుసుకున్నారు. ఇంతకు ముందు ఉన్న అనారోగ్య సమస్యలతోనే యువతి అస్వస్థతకు గురై ఉండొచ్చని, కరోనా టీకాతో కాదని ప్రాథమికంగా ధ్రువీకరించారు. రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. 


 

Updated Date - 2021-12-08T04:44:19+05:30 IST