ధర్మసాగర్‌లో అక్రమంగా మట్టి తరలింపు

ABN , First Publish Date - 2021-05-03T05:28:58+05:30 IST

మండల పరిధిలోని ధర్మసాగర్‌ గ్రామ పంచాయతీలోని తండాలో మండలంలోని అధికార పార్టీ నాయకులు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు.

ధర్మసాగర్‌లో అక్రమంగా మట్టి తరలింపు

కౌడిపల్లి, మే 2 : మండల పరిధిలోని ధర్మసాగర్‌ గ్రామ పంచాయతీలోని  తండాలో మండలంలోని అధికార పార్టీ నాయకులు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా మట్టిని పోసేందుకు ధర్మసాగర్‌లో గల తాటిమీది చెరువులో నుంచి అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నారు. అంతేకాకుండా వారి సొంత వెంచర్‌లోని రోడ్ల నిర్మాణానికి కూడా మట్టిని తరలిస్తుండగా స్థానిక బీజేపీ నాయకుడు రాకేశ్‌ మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌ తారకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే మట్టి తరలింపును నిలిపివేయాలని స్థానిక అధికార పార్టీ నాయకులను తహసీల్దార్‌ ఆదేశించారు. అనుమతి లేకుండా మట్టిని తరలిస్తే వాల్టా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.


Updated Date - 2021-05-03T05:28:58+05:30 IST