పెండింగ్ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-10-26T05:28:32+05:30 IST
పెండింగ్‌లో ఉన్న మర్కుక్ పోలీ్సస్టేషన్లోని నిర్మాణ పనులను నెలరోజుల్లోగా పూర్తి చేయాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీపీ సంజయ్‌కుమార్‌జైన్ సూచించారు. మర్కుక్ పోలీ్‌సస్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న మెన్ బ్యారక్, డైనింగ్‌హాల్, నిర్మాణ దశలో ఉన్న సిబ్బంది క్వార్టర్స్, ఎస్ఐ క్వార్టర్, ఆఫీసర్స్ గెస్ట్‌హౌస్ పనులను తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఎస్పీ రెమా రాజేశ్వరీ, పోలీస్ కమిషనర్ జోయల్ డేవి్‌సతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు.

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీపీ సంజయ్ కుమార్‌జైన్
జగదేవ్‌పూర్, అక్టోబరు 25 : పెండింగ్‌లో ఉన్న మర్కుక్ పోలీ్సస్టేషన్లోని నిర్మాణ పనులను నెలరోజుల్లోగా పూర్తి చేయాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీపీ సంజయ్‌కుమార్‌జైన్ సూచించారు. మర్కుక్ పోలీ్‌సస్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న మెన్ బ్యారక్, డైనింగ్‌హాల్, నిర్మాణ దశలో ఉన్న సిబ్బంది క్వార్టర్స్, ఎస్ఐ క్వార్టర్, ఆఫీసర్స్ గెస్ట్‌హౌస్ పనులను తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఎస్పీ రెమా రాజేశ్వరీ, పోలీస్ కమిషనర్ జోయల్ డేవి్‌సతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. అనంతరం నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తర్వాత అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ విజయ్‌కుమార్, ఈఈ శ్రీనివా్‌సరావు, డీఈ రాజయ్య, ఏఈ సుధాకర్, కాంట్రాక్టర్ ప్రసాద్‌రావు, గజ్వేల్ ఏసీపీ రమేష్, గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు, మర్కుక్ ఎస్ఐ శ్రీశైలం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.