చందాయిపేటలో పురాతన ఆలయాల గుర్తింపు

ABN , First Publish Date - 2021-07-28T04:18:54+05:30 IST

మెదక్‌ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో 12, 14వ శతాబ్దంలో నిర్మించిన నాలుగు పురాతన ఆలయాలను, రాతిపై చెక్కిన దేవతామూర్తులను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర సభ్యులు పేర్కొన్నారు.

చందాయిపేటలో పురాతన ఆలయాల గుర్తింపు
12వ శతాబ్దపు శివాలయం

చేగుంట, జూలై 27 : మెదక్‌ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో 12, 14వ శతాబ్దంలో నిర్మించిన నాలుగు పురాతన ఆలయాలను, రాతిపై చెక్కిన దేవతామూర్తులను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర సభ్యులు పేర్కొన్నారు. 12వ శతాబ్దంలో నిర్మించిన శివాలయం, రాయిపై చెక్కిన భైరవుడు, 14వ శతాబ్దంలో మహిషాసుర మర్దిని దేవతామూర్తి విగ్రహాలుగా గుర్తించారు. వేణుగోపాలస్వామి ఆలయంతో పాటు ఊరి చివర్లో హనుమాన్‌ ఆలయాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ తెలిపారు. వీరితో పాటు సర్పంచ్‌ స్వర్ణలతభాగ్యరాజ్‌, కొత్త తెలంగాణ చరిత్ర సభ్యులు హరగోపాల్‌ ఉన్నారు.

Updated Date - 2021-07-28T04:18:54+05:30 IST