విస్తరణలో జోరు.. వసతుల్లో పూర్
ABN , First Publish Date - 2021-12-31T05:05:41+05:30 IST
హుస్నాబాద్ పట్టణం వేగంగా విస్తరిస్తున్నది.. వసతల కల్పనలో మాత్రం వెనుకబడిపోతున్నది. థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన పట్టణంలో ఏటా వందలాది ఇళ్లను నిర్మిస్తున్నారు. పట్టణ శివారుల్లో ఎక్కడ చూసినా నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీనికితోడు పట్టణానికి చుట్టుపక్కల పుట్టగొడుగుల్లా రియల్‌ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. పట్టణ విస్తరణతో మున్సిపాలిటీకి పెద్దఎత్తున ఆదాయం వస్తున్నా అందుకు తగినఉ్ట వసతులు మాత్రం అభివృద్ధి చెందడంలేదు. పార్క్‌లు, రోడ్లు, జంక్షన్లు, విద్యుద్దీపాలు అభివృద్ధి చెందడంలేదు.

హుస్నాబాద్‌లో జోరుగా భవన నిర్మాణాలు
కొత్తగా వందల్లో ఇళ్ల నిర్మాణాలు
పట్టణం చుట్టూ పుట్టుకొస్తున్న వెంచర్లు
సౌకర్యాల కల్పనలో వెనుకబాటు
రోడ్లు, వీధి దీపాలు కూడా కరువు
హుస్నాబాద్, డిసెంబరు 30 : హుస్నాబాద్ పట్టణం వేగంగా విస్తరిస్తున్నది.. వసతల కల్పనలో మాత్రం వెనుకబడిపోతున్నది. థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన పట్టణంలో ఏటా వందలాది ఇళ్లను నిర్మిస్తున్నారు. పట్టణ శివారుల్లో ఎక్కడ చూసినా నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీనికితోడు పట్టణానికి చుట్టుపక్కల పుట్టగొడుగుల్లా రియల్‌ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. పట్టణ విస్తరణతో మున్సిపాలిటీకి పెద్దఎత్తున ఆదాయం వస్తున్నా అందుకు తగినఉ్ట వసతులు మాత్రం అభివృద్ధి చెందడంలేదు. పార్క్‌లు, రోడ్లు, జంక్షన్లు, విద్యుద్దీపాలు అభివృద్ధి చెందడంలేదు. సిద్దిపేట, కరీంనగర్, జనగామ, హన్మకొండ పట్టణాలకు 40 కిలోమీటర్ల దూరంలోనే హుస్నాబాద్ పట్టణం ఉన్నది. నియోజకవర్గ కేంద్రమైన ఈ పట్టణం గత రెండేళ్లుగా వేగంగా విస్తరిస్తున్నది. అధికారుల లెక్కల ప్రకారం పట్టణంలో 6,600 ఇళ్లు ఉన్నాయి. గత రెండేళ్లలో దాదాపు 300 ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్నారు. 230 ఇళ్లకు నెంబర్లను కేటాయించారు. ఇదేకాకుండా పట్టణ సమీపంలోని గాంధీనగర్, కిసాన్‌నగర్, నాగారం, పోతారం(ఎస్), కొండాపూర్ వంటి గ్రామాలను హుస్నాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణం చుట్టుపక్కల రియల్టర్లు నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు.
సుందరీకరణలో వెనుకడుగు..
వేగంగా విస్తరిస్తున్న హుస్నాబాద్ పట్టణం వసతుల కల్పనలో మాత్రం వెనుబడింది. మల్లెచెట్టు చౌరస్తా, అక్కన్నపేట చౌరస్తా, నాగారం రోడ్లు చౌరస్తా, అనభేరి చౌరస్తా, సబ్‌స్టేషన్ చౌరస్తాలను విస్తరించాల్సిన అవసరం ఉన్నది. నాగారం రోడ్డు, అక్కన్నపేట రోడ్డు, రామవరం రోడ్లు, డిపో బైపాస్ రోడ్లు ఇరుకుగా ఉండి రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ఎల్లమ్మ చెరువు మినీట్యాంక్‌బండ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
పార్కులను అభివృద్ధి చేస్తున్నాం : ఆకుల రజిత, మున్సిపల్ చైర్‌పర్సన్
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు, బస్‌డిపో కాలనీల్లో పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఎల్కతుర్తి హైవే నిర్మాణ నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, అనబేరి చౌరస్తాల అభివృద్ధి వాయిదాపడింది. కరీంనగర్ రోడ్డు, నాగారం రోడ్డులో జంక్షన్ల అభివృదిద్ధకి ప్రతిపాదనలు పంపించాం. స్వచ్ఛ సర్వేక్షన్‌లో మున్సిపాలిటీకి జాతీయ అవార్డు వచ్చింది.