తడిచెత్తను ఎరువుగా మార్చుకోవాలి

ABN , First Publish Date - 2021-12-31T17:00:28+05:30 IST

తడి చెత్తను ఇళ్లలోనే ఎరువుగా మార్చుకొని మొక్కలకు వాడాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత సూచించారు.

తడిచెత్తను ఎరువుగా మార్చుకోవాలి

హుస్నాబాద్‌, డిసెంబరు 30: తడి చెత్తను ఇళ్లలోనే ఎరువుగా మార్చుకొని మొక్కలకు వాడాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత సూచించారు. గురువారం ఆమె హుస్నాబాద్‌ పట్టణంలోని 12వ వార్డును ఆత్మ నిర్బర్‌ వార్డుగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, కౌన్సిలర్‌ గూళ్ల రాజు, రవికుమార్‌, సరళ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T17:00:28+05:30 IST