పనిచేయని కాంగ్రెస్ జిమ్మిక్కులు, ప్రలోభాలు
ABN , First Publish Date - 2021-12-15T05:44:09+05:30 IST
శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల జిమ్మిక్కులు, ప్రలోభాలు పనిచేయలేదని మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన ఒంటరి యాదవరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

శాసనమండలి ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్ స్పందన
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు 14: శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల జిమ్మిక్కులు, ప్రలోభాలు పనిచేయలేదని మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన ఒంటరి యాదవరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ పార్టీకి 754 ఓట్లు ఉండగా 8 ఓట్లు అదనంగా వచ్చాయన్నారు. అద్భుత విజయానికి కృషి చేసిన స్థానిక సంస్థల ప్రతినిధులందరికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో రాజకీయం చేయాలని చూసిన కాంగ్రెస్‌కు వారు గట్టిగా బుద్ది చెప్పారన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల వేతనాలను పెంచింది తమ పార్టీయేనన్నారు. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధులను బీజేపీ తగ్గిస్తే తమ ప్రభుత్వం మాత్రం అంతకు సమానమైన నిధులను కలిపి గ్రామ పంచాయతీలకు అందజేస్తున్నదన్నారు.