రైతులను బీజేపీ నేతలు అయోమయానికి గురిచేస్తున్నారు: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-11-23T21:41:43+05:30 IST

మెదక్‌: బీజేపీపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

రైతులను బీజేపీ నేతలు అయోమయానికి గురిచేస్తున్నారు: హరీష్‌రావు

మెదక్‌: బీజేపీపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గల్లీ బీజేపీ నేతలు వరి వేయాలంటారని.. ఢిల్లీ బీజేపీ వరి వేయొద్దంటోందని, రైతులను బీజేపీ నేతలు అయోమయానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కించపరిచే విధంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం యాసంగిలో రా రైస్ కొంటామని అంటోందని, యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుంది కానీ.. రా రైస్ రాదనే విషయం కిషన్‌రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు సమస్య లేదని కిషన్‌రెడ్డి అనడం సరికాదన్నారు. గ్రామాల్లోకి వచ్చి చూస్తే రైతుల సమస్యలు తెలుస్తాయని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-11-23T21:41:43+05:30 IST