వేలాడుతున్న విద్యుత్‌ తీగలు

ABN , First Publish Date - 2021-11-22T04:44:19+05:30 IST

సిర్గాపూర్‌ మండలం ఉజలంపాడ్‌ శివారులో విద్యుత్‌ తీగలు కిందికి వేలాడుతుండడంతో రైతులు, పశువులను మేపే వారు ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందోనని ఆందోళన చెందుతున్నారు

వేలాడుతున్న విద్యుత్‌ తీగలు

పొంచి ఉన్న ప్రమాదం

నారాయణఖేడ్‌, నవంబరు 21: సిర్గాపూర్‌ మండలం ఉజలంపాడ్‌ శివారులో విద్యుత్‌ తీగలు కిందికి వేలాడుతుండడంతో రైతులు, పశువులను మేపే వారు ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల  భారీ వర్షాలు కురియడంతో విద్యుత్‌ స్తంబాలు వంగి పోవడంతో హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు కిందికి వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియడం లేదని వాపోయారు. అందువల్ల అధికారులు స్పందించి ప్రమాదం జరుగక ముందే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-11-22T04:44:19+05:30 IST