జహీరాబాద్‌లో వడగళ్ల వర్షం

ABN , First Publish Date - 2021-05-09T04:57:44+05:30 IST

జహీరాబాద్‌ పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులతోపాటు వడగళ్లతో కూడిన వర్షం కురిసింది.

జహీరాబాద్‌లో వడగళ్ల వర్షం
జహీరాబాద్‌ పట్టణంలో కురుస్తున్న వడగళ్లు

జహీరాబాద్‌, మే 8: జహీరాబాద్‌ పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులతోపాటు వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. సుమారు గంటపాటు ఎడతెరపి లేకుండా గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు గంటపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం వర్షం కురవడంతో ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. 


 

Updated Date - 2021-05-09T04:57:44+05:30 IST