చౌటపల్లిలో హరితహారం అపహాస్యం

ABN , First Publish Date - 2021-05-02T05:55:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు నీళ్లు పోయకపోవడంతో అవి ఎండిపోతున్నాయి.

చౌటపల్లిలో హరితహారం అపహాస్యం
చౌటపల్లిలో నీళ్లు పట్టకపోవడంతో ఎండిపోతున్న మొక్కలు

ఎండిపోతున్న మొక్కలు

పట్టించుకోని సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి

అక్కన్నపేట, మే 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు నీళ్లు పోయకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టాల్సి ఉన్నా పట్టకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత స్థానిక సర్పంచులు,కార్యదర్శులకు ప్రభుత్వం అప్పగించింది. కాగా మొక్కలకు నీళ్లు పట్టకపోవడంతో ఎండిపోతున్నాయని, రోడ్డుపై వెళ్తున్న మేకలు, గొర్రెలు మొక్కలను మేస్తున్న సర్పంచ్‌, కార్యదర్శి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-05-02T05:55:57+05:30 IST