ప్రజావంచక పాలన చేస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2021-07-13T05:01:41+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావంచక పాలన సాగిస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య అన్నారు.

ప్రజావంచక పాలన చేస్తున్న ప్రభుత్వాలు
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య

చేర్యాల/గజ్వేల్‌, జూలై 12 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావంచక పాలన సాగిస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు ఊడిగం చేస్తూ రైతు వ్యతిరేక చట్టాల అమలుతో పాటు నిత్యావస సరుకుల ధరలను పెంచినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి, గొల్లకురుమలకు గొర్రెలు, నూతన పింఛన్లు, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల మంజూరీలో కాలయాపన చేస్తున్నదన్నారు. ఈ సమావేశంలో పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, నాయకులు దాసరి కళావతి, శశిధర్‌, వెంకట్‌మావో, శ్రీనివాస్‌, బండకింది అరుణ్‌కుమార్‌, శ్రీహరి, స్వర్గం శ్రీకాంత్‌ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సందబోయిన ఎల్లయ్య పిలుపునిచ్చారు. గజ్వేల్‌ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన పట్టణశాఖ మహాసభలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ భారం మోపుతున్నదన్నారు. అలాగే మల్లన్నసాగర్‌లో సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల ప్రజలకు పూర్తి నష్టపరిహారం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందన్నారు. ఆయన వెంట ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, నాయకులు రంగారెడ్డి, నర్సింహారెడ్డి, మహేందర్‌, నర్సింహులు, మహబూబ్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-07-13T05:01:41+05:30 IST