ప్రభుత్వాలు కుప్పకూలక తప్పదు

ABN , First Publish Date - 2021-12-10T04:41:51+05:30 IST

రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వాలు కుప్పకూలక తప్పదని భారతీయ కిసాన్‌సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాలు కుప్పకూలక తప్పదు

 భారతీయ కిసాన్‌సంఘ్‌  జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌రెడ్డి 


మిరుదొడ్డి, డిసెంబరు 9: రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వాలు కుప్పకూలక తప్పదని భారతీయ కిసాన్‌సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం మిరుదొడ్డిలో రైతులతో కలిసి మాట్లాడారు. యాసంగిలో వరిపంటను సాగుచేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో వరిపంటలకు మాత్రమే అనూకులంగా ఉంటుందన్నారు. ఆరుతడి పంటలను వచ్చే ఏడాది నుంచి పండిస్తామని, ఇప్పుడు మాత్రం వరిపంటను మాత్రమే వేస్తామని స్పష్టం చేశారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున కూరగాయాల పంటల దిగుబడి రాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆలోచించి రైతులకు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అనంతరం భారతీయ కిసాన్‌సంఘ్‌ మిరుదొడ్డి మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండలాధ్యక్షుడిగా రాజేశ్వర్‌రావు, ఉపాధ్యక్షులుగా అంజిరెడ్డి, రాజయ్య, కార్యదర్శిగా లక్ష్మారెడ్డి, సహాయ కార్యదర్శులుగా రాజు, లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు.


 

Updated Date - 2021-12-10T04:41:51+05:30 IST