విత్తన అమ్మకాలపై ప్రభుత్వ విధానం సరికాదు

ABN , First Publish Date - 2021-11-01T04:21:54+05:30 IST

విత్తన అమ్మకాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఫుట్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌరిశెట్టి మునీందర్‌ అన్నారు.

విత్తన అమ్మకాలపై  ప్రభుత్వ విధానం సరికాదు

తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఫుట్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ 

రాష్ట్ర అధ్యక్షుడు గౌరిశెట్టి మునీందర్‌


గజ్వేల్‌, అక్టోబరు 31: విత్తన అమ్మకాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఫుట్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌరిశెట్టి మునీందర్‌ అన్నారు. గజ్వేల్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగి న సిద్దిపేట జిల్లా ఇన్‌పుట్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేయబోమని చెప్పిన యెడల ప్రత్యామ్నాయంగా వేరే విత్తనాల విక్రయాలకు అనుమతులు ఇవ్వాలన్నారు. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం బాధాకరమన్నారు. యాసంగి దగ్గర పడడంతో రైతులు, వ్యాపారులు, విత్తనాలను తయారు చేసిన కంపెనీలు సందిగ్ధంలో పడిపోయాయని స్పష్టం చేశారు. ఐదెకరాలున్న రైతుకు కనీసం ఒక ఎకరం వరి విత్తనం వేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. జిల్లా అధ్యక్షునిగా పట్టణానికి చెందిన గోళి సంతో్‌షకుమార్‌, ప్రధాన కార్యదర్శిగా హర్పత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో తెలంగాణ ఫర్టిలైజర్స్‌ ఆగ్రో అసోసియేషన్‌ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, జిల్లాకు చెందిన డీలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-01T04:21:54+05:30 IST