ఆడపిల్ల పుడితె సారె, చీర

ABN , First Publish Date - 2021-03-10T06:06:27+05:30 IST

ఆడపిల్ల పుడితే సారే.. చీర అందించాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం నిజాంపేట సర్పంచ్‌ జగన్‌చారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఆడపిల్ల పుడితె సారె, చీర
నిజాంపేటలో ఆడపిల్లల తల్లిదండ్రులకు చీర, సారె అందజేస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, సర్పంచ్‌ జగన్‌చారి

వినూత్న కార్యక్రమం చేపట్టిన నిజాంపేట సర్పంచ్‌ జగన్‌చారి

అభినందించిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిఅభినందించిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి


నారాయణఖేడ్‌, మార్చి 9 : ఆడపిల్ల పుడితే సారే.. చీర అందించాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం నిజాంపేట సర్పంచ్‌ జగన్‌చారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం నిజాంపేటలో తంతిరి కృష్ణ, రోజమ్మ దంపతులకు శ్రీకర్ణిక, శ్రీహర్ణిక, కవలలు జన్మించడంతో సర్పంచ్‌ వారి తల్లిదండ్రులకు నూతన వస్ర్తాలు అందజేయడే కాకుండా గ్రామస్థులకు మిఠాయిలు పంచారు. తమ నియోజకవర్గంలోని నిజాంపేటలో ఇక నుంచి ఎవరింట్లో ఆడ పిల్ల పుట్టినా చీర, సారేతో పాటు వారికి సుకన్య యోజన పథకంలో చేర్పించే కార్యక్రమాన్ని సర్పంచ్‌ చేపట్టడం అభినందనీయమన్నారు. అంతకుముందు మహిళా దినోత్సవాలను పురస్కరించుకుని గ్రామంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 55 మంది మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కళింగ  కృష్ణకుమార్‌, సేవాలాల్‌ యువజన సంఘం నాయకులు రమే్‌షచౌహాన్‌, సర్పంచ్‌ జగన్‌చారి, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఉప సర్పంచ్‌ రాజీబాయి రాంచందర్‌, వార్డుసభ్యులు నీలేరావు, యాదయ్య, రజాక్‌, సాయిలు, పుట్టి అంజయ్య, నర్సింహులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-10T06:06:27+05:30 IST