ఘనంగా మల్లన్నగుట్ట జాతర

ABN , First Publish Date - 2021-12-20T05:12:45+05:30 IST

కల్హేర్‌ మండలం దేవునిపల్లి, మాసాన్‌పల్లి గ్రామపంచాయతీల పరిధిలోని దేవునిగుట్ట మల్లన్నస్వామి, నాగ్‌ధర్‌లోని అటవీ ప్రాంతంలో ఉన్న మల్లికార్జునస్వామి జాతర ఆదివారం ఘనంగా జరిగింది.

ఘనంగా మల్లన్నగుట్ట జాతర
ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని సన్మానిస్తున్న ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ దిలీ్‌ప

కల్హేర్‌, డిసెంబరు 19 : కల్హేర్‌ మండలం దేవునిపల్లి, మాసాన్‌పల్లి గ్రామపంచాయతీల పరిధిలోని దేవునిగుట్ట మల్లన్నస్వామి, నాగ్‌ధర్‌లోని అటవీ ప్రాంతంలో ఉన్న మల్లికార్జునస్వామి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఖేడ్‌ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి పాల్గొని మల్లన్నస్వామిని దర్శించుకున్నారు. అలాగే ఈ ప్రాంతానికి చెందినవారే కాకుండా మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యేను ఖేడ్‌ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ దిలీ్‌పకుమార్‌, కల్హేర్‌ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, నాయకులు భూపాల్‌, నారాయణరావ్‌, రాముజ్యోషి, దామోదర్‌రెడ్డి సన్మానించారు.

కోహీర్‌: మండల పరిధిలోని బిలాల్‌పూర్‌ గ్రామంలో మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారి గ్రామ మహిళలు బోనాలు సమర్పించారు. మధ్యాహ్నం స్వామివారికి కల్యాణం, అగ్గి తొక్కుడు, భజన, రాత్రి 10 గంటలకు గ్రామ పురవీధుల నుంచి రథోత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలు సోమవారం ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. 

అల్లాదుర్గం : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచిన అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్‌ మల్లికార్జునస్వామి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతియేటా ధనుర్మాసంలో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఏడువారాలు (ఆదివారం) నిర్వహించే ఈ వేడుకల్లో గ్రామ ప్రజలే కాకుండా సమీపంలోని పలు గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొంటారు. భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి తమ్మలి చంద్రయ్య ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోతురాజుల విన్యాసాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. 

Updated Date - 2021-12-20T05:12:45+05:30 IST