‘నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి’
ABN , First Publish Date - 2021-12-30T19:57:24+05:30 IST
గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హుస్నాబాద్ నియోజకవర్గ వృక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

అక్కన్నపేట, డిసెంబరు 29: గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హుస్నాబాద్ నియోజకవర్గ వృక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద ఏడు రోజులుగా భూనిర్వాసితులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించిన తర్వాతే ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలని, పనులను అడ్డుకున్న నిర్వాసితులపై లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే భూ నిర్వాసితులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో వారి పక్షాన పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలందరినీ ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి, సర్పంచ్ బద్దం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.