గ్యాస్‌ సిలిండర్‌ పేలి ధ్వంసమైన ఇల్లు

ABN , First Publish Date - 2021-05-02T05:52:05+05:30 IST

గ్యాస్‌ సిలిండర్‌ పేలి పాక్షికంగా ఇల్లు ధ్వంసమైన ఘటన శనివారం రాత్రి మండల కేంద్రంలో జరిగింది.

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ధ్వంసమైన ఇల్లు
బెజ్జంకిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ధ్వంసమైన ఇల్లు

తప్పిన ప్రాణనష్టం 

బెజ్జంకి, మే 1 : గ్యాస్‌ సిలిండర్‌ పేలి పాక్షికంగా ఇల్లు ధ్వంసమైన ఘటన శనివారం రాత్రి మండల కేంద్రంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... మండల కేంద్రానికి చెందిన గుంటుపల్లి మల్లేశం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు గమనించి  పోలీసుల కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఇంట్లోని సిలిండర్‌ పేలి ఇంటి పైకప్పు రేకులు ధ్వంసమై పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.

Updated Date - 2021-05-02T05:52:05+05:30 IST