గ్యాస్‌ సిలిండర్‌ పేలి పూరిల్లు దగ్ధం

ABN , First Publish Date - 2021-12-31T17:14:32+05:30 IST

గ్యాస్‌ సిలిండర్‌ పేలి పూరిల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని వెంకట్రావుపుల్లిలో చోటు చేసుకున్నది.

గ్యాస్‌ సిలిండర్‌ పేలి పూరిల్లు దగ్ధం

చిన్నశంకరంపేట, డిసెంబరు 30 : గ్యాస్‌ సిలిండర్‌ పేలి పూరిల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని వెంకట్రావుపుల్లిలో చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన నంద్యాల నర్సింహులు తన కుటుంబసభ్యులతో కలిసి శాలిపేట గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం ఒక్కసారిగా సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మెదక్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే ఇల్లు దగ్ధమై రూ.50 వేల నగదు, రెండు క్వింటాళ్ల బియ్యం, పట్టాపాసు పుస్తకాలు, బట్టలు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. నర్సింహులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ లక్ష్మీనర్సయ్య కోరారు. 

Updated Date - 2021-12-31T17:14:32+05:30 IST