గణపతి షుగర్స్‌ కార్మికుల డిమాండ్లను తీర్చాలి

ABN , First Publish Date - 2021-10-30T04:55:34+05:30 IST

సంగారెడ్డి సమీపంలోని గణపతి షుగర్స్‌ పరిశ్రమ కార్మికుల డిమాండ్లను వెంటనే తీర్చాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

గణపతి షుగర్స్‌ కార్మికుల డిమాండ్లను తీర్చాలి

 టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి డిమాండ్‌

సంగారెడ్డి టౌన్‌, అక్టోబరు 29: సంగారెడ్డి సమీపంలోని గణపతి షుగర్స్‌ పరిశ్రమ కార్మికుల డిమాండ్లను వెంటనే తీర్చాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ఐదు రోజులుగా కార్మికులు చేపడుతున్న సమ్మెకు శుక్రవారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... ప్రతీ మూడేళ్లకు ఒకసారి అగ్రిమెంట్‌ ప్రకారం వేతనాలు పెంచాలన్నారు.  షుగర్‌ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ వెంటనే కార్మికుల డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలని,  జీఎం మొండి వైఖరిని వీడి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌తో సంబంధం లేకుండా కార్మికుల కోసం తాను పోరాడాతానని స్పష్టం చేశారు. సమ్మె కారణంగా కార్మికులతో పాటు చెరుకు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎం మొండి వైఖరి వీడకపోతే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. కంపెనీతో జీఎం మాట్లాడి కార్మికులకు, యాజమాన్యానికి మధ్య చర్చలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  

Updated Date - 2021-10-30T04:55:34+05:30 IST