కాలుష్య నియంత్రణకు నిధులివ్వండి

ABN , First Publish Date - 2021-03-23T04:36:40+05:30 IST

పటాన్‌చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు జాతీయ క్లీన్‌ ఎయిర్‌ కార్యక్రమం కింద రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి నిధులు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు.

కాలుష్య నియంత్రణకు నిధులివ్వండి

 కేంద్రాన్ని కోరిన ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి


న్యూఢిల్లీ, మార్చి 22: పటాన్‌చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు జాతీయ క్లీన్‌ ఎయిర్‌ కార్యక్రమం కింద రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి నిధులు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ క్లీన్‌ ఎయిర్‌ కార్యక్రమానికి ఇచ్చే నిధులను మరింత పెంచాలని కోరారు. ప్రపంచంలో విపరీతంగా కాలుష్యం బారిన పడ్డ 30 పట్టణాల్లో 22 పట్టణాలు దేశంలోనే ఉన్నాయని వివరించారు. 


Updated Date - 2021-03-23T04:36:40+05:30 IST