పురుగుమందు తాగబోయిన రైతులు

ABN , First Publish Date - 2021-05-19T04:53:52+05:30 IST

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజులు గడిచినా ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ మండల కేంద్రమైన శివ్వంపేటలోని పీఏసీఎస్‌ వద్ద రైతులు మంగళవారం పురుగుల మందు సీసాతో నిరసన వ్యక్తం చేశారు.

పురుగుమందు తాగబోయిన రైతులు
పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగేందుకు యత్నిస్తున్న రైతు

నెలరోజులుగా కేంద్రాల్లోనే ధాన్యం   

కొనుగోళ్లు లేక ఆందోళన


నర్సాపూర్‌ (శివ్వంపేట), మే 18: ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజులు గడిచినా ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ మండల కేంద్రమైన శివ్వంపేటలోని పీఏసీఎస్‌ వద్ద రైతులు మంగళవారం పురుగుల మందు సీసాతో నిరసన వ్యక్తం చేశారు. శివ్వంపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ఏరర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి  పలు గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున ధాన్యాన్ని తీసుకువచ్చారు. అయితే లారీల కొరత, హమాలీలు లేకపోవడం తదితర కారణాలతో కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. నెల రోజులుగా రైతులు కేంద్రం వద్దనే పడిగాపులు కాస్తున్నారు. విసుగుచెందిన రైతులు మంగళవారం ఏకంగా పెరుగుమందు తెచ్చుకుని, కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పీఏసీఎస్‌ ఛైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి అక్కడకు చేరుకుని రైతులను సముదాయించారు. ఆందోళనను విరమింపజేశారు.

Updated Date - 2021-05-19T04:53:52+05:30 IST