ప్రైవేటు పరిశ్రమకు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రోడ్డు పక్కనున్న చెట్ల నరికివేత

ABN , First Publish Date - 2021-05-02T05:45:11+05:30 IST

సంగారెడ్డి శివారులోని ఓ పరిశ్రమకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాడానికి కంది మండల కేంద్రంలోని 65 జతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద పెద్ద సుబాబుల్‌ చెట్లను, కొమ్మలను శనివారం ఇష్టారీతిన నరికివేశారు. కంది పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి ఐఐటీహెచ్‌ కంది శివారులోని సంగమహేశ్వర ఆలయం వరకు చెట్ల కొమ్మలను నరికివేశారు.

ప్రైవేటు పరిశ్రమకు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం  రోడ్డు పక్కనున్న చెట్ల నరికివేత
సంగారెడ్డి జిల్లా కందిలోని 65 నంబరు జాతీయ రహదారి పక్కన అనుమతులు లేకుండా నరికివేసిన చెట్లను చూపుతున్న సర్పంచ్‌ బుగ్గన్నగారి విమలావీరేశం

 అడ్డుకున్న కంది సర్పంచ్‌ విమల


కంది, మే 1: సంగారెడ్డి శివారులోని ఓ పరిశ్రమకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాడానికి కంది మండల కేంద్రంలోని 65 జతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద పెద్ద సుబాబుల్‌ చెట్లను, కొమ్మలను శనివారం ఇష్టారీతిన నరికివేశారు. కంది పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి ఐఐటీహెచ్‌ కంది శివారులోని సంగమహేశ్వర ఆలయం వరకు చెట్ల కొమ్మలను నరికివేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కంది సర్పంచ్‌ బుగ్గన్నగారి విమలావీరేశం హుటాహుటిన వెళ్లి చెట్ల నరికివేతను అడ్డుకున్నారు. చెట్లను నరికివేయడానికి అనుమతులు ఎవరూ ఇచ్చారని విద్యుత్‌ శాఖ సిబ్బందిని నిలదీశారు. రాష్ట్రమంతటా హరితహారం కార్యక్రమం ద్వారా చెట్లను పెంచుతుంటే.. ఇన్ని సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న చెట్లను ప్రైవేటు పరిశ్రమ కోసం నరికివేయడం తగదని విద్యుత్‌శాఖ అధికారులపై మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ డిమండ్‌ చేశారు. 


 

Updated Date - 2021-05-02T05:45:11+05:30 IST