కిష్టాపూర్‌లో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-30T19:59:00+05:30 IST

పూరిపాకకు నిప్పంటుకోవడంతో అందులో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు, నిల్వ ఉంచిన రెండు క్వింటాళ్ల పత్తి, ఇంటి సామగ్రి దగ్ధమైన సంఘటన మండలంలోని..

కిష్టాపూర్‌లో అగ్ని ప్రమాదం

2 బైకులు, రెండు క్వింటాళ్ల పత్తి దగ్ధం

తూప్రాన్‌రూరల్‌, డిసెంబరు 29 : పూరిపాకకు నిప్పంటుకోవడంతో అందులో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు, నిల్వ ఉంచిన రెండు క్వింటాళ్ల పత్తి, ఇంటి సామగ్రి దగ్ధమైన సంఘటన మండలంలోని కిష్టాపూర్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. గుర్తు తెలియని వ్యక్తులు పాతకక్షలతోనే ద్విచక్ర వాహనాల పెట్రోల్‌ ట్యాంకులను ఇప్పి నిప్పు పెట్టడంతో ప్రమాదం జరిగినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. కుమ్మరి భూపాల్‌కు చెందిన పూరిపాకలో ఇద్దరు కొడుకులు రెండు ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌ చేశారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలకు నిప్పటించడంతో పూర్తిగా కాలిపోయాయి. అలాగే పాకలో సంచుల్లో నిల్వచేసిన రెండు క్వింటాళ్ల పత్తి, వంట సామగ్రి, బట్టలు మొదలగు వస్తువులన్నీ తగలబడిపోయాయి. సుమారు రూ.2.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు పంచనామా చేశారు. బాధితుడు భూపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-30T19:59:00+05:30 IST