రైతులకు 72 గంటల్లో డబ్బులు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-11-24T05:23:28+05:30 IST

కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు 72 గంటల్లో డబ్బులు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు.

రైతులకు 72 గంటల్లో డబ్బులు చెల్లించాలి
సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో వరి ధాన్యాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ హన్మంతరావు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు 

సంగారెడ్డిరూరల్‌, నవంబరు 23 : కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు 72 గంటల్లో డబ్బులు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు. సంగారెడ్డి మండలం ఫసల్‌వాది గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా సందర్శించి వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం కొనుగోలులో జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే సమయంలో నిర్ధారించిన ప్రమాణాల మేరకు తేమశాతం చూసుకుని తేవాలన్నారు. కలెక్టర్‌ వెంట కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, రైతులు ఉన్నారు.

Updated Date - 2021-11-24T05:23:28+05:30 IST