యాసంగి సాగుపై రైతుల సందిగ్ధం

ABN , First Publish Date - 2021-11-22T04:36:54+05:30 IST

యాసంగిలో ఏ పంట వేయాలో ప్రభుత్వం తేల్చకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.

యాసంగి సాగుపై రైతుల సందిగ్ధం

  ఏ పంట వేయాలో ఎటూ తేల్చని ప్రభుత్వం

 అయోమయంలో అన్నదాతలు


చిన్నకోడూరు, నవంబరు 21: యాసంగిలో ఏ పంట వేయాలో ప్రభుత్వం తేల్చకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. వర్షాకాలంలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, పత్తి, కంది పంటలు కోసిన రైతులు యాసంగి పంటలు సాగు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. పలు చోట్ల యాసంగి సాగుకు రైతులు దుక్కిదున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని ప్రభుత్వం చెబుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఎక్కువగా వరి పంటనే సాగు


మండలంలో అత్యధికంగా రైతులు వరి, మొక్కజొన్న, పత్తి, కంది, కూరగాయాల పంటలను సాగు చేస్తారు. ఈసారి జలాశయాల్లో సమృద్ధిగా నీరుండడంతో రైతులు వరి పంటను సాగు చేసే అవకాశం ఉంది. సౌడు, జాలు (నీరు) పారే పొలాల్లో వరి తప్ప వేరే పంట సాగు చేసేందుకు వీలుకాదని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ అధికారులు వరి సాగు చేయ వద్దని చెబుతుండడంతో ఏ పంటలు సాగు చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు యాసంగిలో పంటల సాగుపై స్పష్టమైన హమీ ఇవ్వడంతో పాటు, భరోసా కల్పించాలని  రైతులు కోరుతున్నారు.


 


Updated Date - 2021-11-22T04:36:54+05:30 IST