రైతుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-12-31T04:47:37+05:30 IST

సీమాంధ్రుల పాలనలో దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్‌ పండగలా చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపి రైతుల ఆత్మబంధువు అయ్యారని చేర్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌ అన్నారు.

రైతుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్‌

 చేర్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌ 

 కేసీఆర్‌ చిత్రటానికి క్షీరాభిషేకం


చేర్యాల, డిసెంబరు 30: సీమాంధ్రుల పాలనలో దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్‌ పండగలా చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపి రైతుల ఆత్మబంధువు అయ్యారని చేర్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌ అన్నారు. రైతుబంధు నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం చేర్యాల అంగడిబజారు చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 24గంటల విద్యుత్‌, నాణ్యమైన విత్తనాలు, సాగునీరు, పంట పెట్టుబడి సహాయం అందించడంతో పాటు రైతుబీమా పథకాన్ని అమలు చేసి మనోధైర్యం కల్పించారన్నారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రైతాంగం రుణపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ పుర్మ వెంకట్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు మంగోలు చంటి, ఆడెపు నరేందర్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు ముస్త్యాల నాగేశ్వర్‌రావు, నాయకులు మంచాల కొండయ్య, తాటికొండ సదానందం, ఉట్కూరి అమర్‌, బూరగోని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


కొమురవెల్లిలో


కొమురవెల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధానచౌరస్తా వద్ద సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సిలివేరి సిద్ధప్ప, వైస్‌ ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, సర్పంచ్‌ సార్ల లత, నాయకులు మేరుగు కృష్ణ, బత్తిని నర్సింహులు, ఆత్కూరి జయరాములు, బొంగు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌


మద్దూరు, డిసెంబరు 30: రైతులకు పెట్టుబడి సాయమందిస్తూ సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడిగా నిలిచాడని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి కొనియాడారు. గురువారం మద్దూరు, దూళిమిట్ట మండలకేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మంద యాదగిరి, మాజీ అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశంతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు వంగ భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు జనార్ధన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ సమ్మయ్య, నాయకులు చల్ల లక్ష్మీనర్సింహారెడ్డి, గూళ్ల ఆనందం, సుందరగిరి పరశురాములు, సోమయ్య, మనోహర్‌, దామెర మల్లేశం, సూర్న అయిలయ్య, మాడిశెట్టి రామాంజనేయులు, బూర్గు నర్సింహులు, సాయిలు, పాల్గొన్నారు.   


తొగుట మార్కెట్‌ యార్డులో 


తొగుట, డిసెంబరు 30: రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం మండల కేంద్రమైన తొగుట మార్కెట్‌ యార్డులో టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకతీతంగా భూమి ఉన్న ప్రతీ ఒక్కరికి రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందిస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని కొనియాడారు. చెరువులను, కుంటలను అభివృద్ధి చేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రాంరెడ్డి, వైఎస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, రైతుబంధు కన్వీనర్‌ కనకయ్య, సర్పంచ్‌ల ఫోరమ్‌ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నర్సింహులు, వివిధ గ్రామాల సర ్పంచ్‌లు, ఎంపీటీసీలు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌లు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌లు, నాయకులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-12-31T04:47:37+05:30 IST