చెక్‌ పోస్టు వద్ద వ్యవసాయాధికారుల తనిఖీ

ABN , First Publish Date - 2021-05-31T05:09:42+05:30 IST

నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టేందుకు ఆదివారం కంగ్టి మండలంలోని అంతర్‌ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మండల వ్యవసాయాధికారి ప్రవీణ్‌చారి, ఎస్‌ఐ అబ్దుల్‌ రఫీక్‌తో కలిసి తనిఖీలు చేపట్టారు.

చెక్‌ పోస్టు వద్ద వ్యవసాయాధికారుల తనిఖీ

కంగ్టి, మే 30: నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టేందుకు ఆదివారం కంగ్టి మండలంలోని అంతర్‌ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మండల వ్యవసాయాధికారి ప్రవీణ్‌చారి, ఎస్‌ఐ అబ్దుల్‌ రఫీక్‌తో కలిసి తనిఖీలు చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కంగ్టిలో ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేశారు. నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మే వ్యాపారులపై తమకు ఫిర్యాదు చేయాలన్నారు. 


 

Updated Date - 2021-05-31T05:09:42+05:30 IST