విద్యుదాఘాతానికి గురై రైతు మృతి
ABN , First Publish Date - 2021-10-21T04:25:11+05:30 IST
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని అల్వాల్ గ్రామంలో చోటు చేసుకున్నది.

మిరుదొడ్డి, అక్టోబరు 20 : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని అల్వాల్ గ్రామంలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కామారం రాములు (39) అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద అడవి పందులకు కాపలాగా వెళ్లాడు. తెల్లవారుజామున బోరుమోటార్ నడవకపోవడంతో స్టాటర్‌ను మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పొలం వద్దకు వెళ్లిన రాములు ఎంతకీ రాకపోవడంతో కుటుంబీకులు వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని దుబ్బాక కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.