మళ్లీ వణికిస్తున్న చలి

ABN , First Publish Date - 2021-02-05T05:47:01+05:30 IST

జిల్లాలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గత నెలలో వణికించిన చలి తర్వాత సాధారణ స్ధాయికి చేరగా మళ్లీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి గాలులు పెరిగాయి.

మళ్లీ వణికిస్తున్న చలి

మెదక్‌ జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

నర్సాపూర్‌లో 10.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు


మెదక్‌ అర్బన్‌, ఫిబ్రవరి 4 : జిల్లాలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గత నెలలో వణికించిన చలి తర్వాత సాధారణ స్ధాయికి చేరగా మళ్లీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి గాలులు పెరిగాయి. జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురువారం జిల్లాలో అత్యల్పంగా నర్సాపూర్‌లో 10.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నాలుగు రోజుల కిత్రం వరకు 18 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణం వేసవిని తలపించింది. కానీ సోమవారం నుంచి చలి తీవ్రత పెరిగింది. దీంతో గాలిలో తేమ శాతం పెరగడం, చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు.


జిల్లాలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

నర్సాపూర్‌లో 10.7 డిగ్రీలు, వెల్దుర్తిలో 10.8, శివ్వంపేటలో 11.2, చిల్‌పచెడ్‌లో 11.7, నార్సింగిలో 11.9, కౌడిపల్లిలో 12.3, పెద్దశంకరంపేటలో 12.4, టేక్మాల్‌లో 12.5, పాపన్నపేట, కొల్చారంలో 12.7, మెదక్‌లో 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - 2021-02-05T05:47:01+05:30 IST