అంతా గందరగోళం!

ABN , First Publish Date - 2021-05-19T05:28:01+05:30 IST

: ప్రభుత్వం అందజేస్తున్న టీకా పంపిణీ కార్యక్రమం మెదక్‌ జిల్లాలో గందరగోళంగా మారింది. వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రభుత్వ రోజుకో కొత్త విధానంతో జనం విసిగిపోతున్నారు. : ప్రభుత్వం అందజేస్తున్న టీకా పంపిణీ కార్యక్రమం మెదక్‌ జిల్లాలో గందరగోళంగా మారింది. వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రభుత్వ రోజుకో కొత్త విధానంతో జనం విసిగిపోతున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న టీకా పంపిణీ కార్యక్రమం మెదక్‌ జిల్లాలో గందరగోళంగా మారింది. వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రభుత్వ రోజుకో కొత్త విధానంతో జనం విసిగిపోతున్నారు.

అంతా గందరగోళం!

మెదక్‌ జిల్లాలో నెరవేరని కొవిడ్‌ టీకా లక్ష్యం 

ఇబ్బందికరంగా మారిన రోజుకో విధానం


ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, మే 18: ప్రభుత్వం అందజేస్తున్న టీకా పంపిణీ కార్యక్రమం మెదక్‌ జిల్లాలో గందరగోళంగా మారింది. వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రభుత్వ రోజుకో కొత్త విధానంతో జనం విసిగిపోతున్నారు. 


సెకండ్‌ డోసుకే దిక్కులేదు.. ఫస్ట్‌ డోస్‌ ఎప్పుడో

వ్యాక్సిన్‌ కొరతతో ఫస్ట్‌డో్‌సను పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మే నెలాఖరు వరకు సెకండ్‌ డోస్‌ మాత్రమే వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. ఈ నెల 15 నుంచి సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ను పూర్తిగా నిలిపివేశారు. తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్‌డోస్‌ కోసం ఎదురుచూస్తున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది. 

జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాగా మెదక్‌ జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 2 వేల 27 మంది మొదటి విడత టీకా తీసుకున్నారు. రెండో విడత టీకాను 19,613 మంది తీసుకున్నారు. వ్యాక్సిన్‌ కొరతతో కేవలం సెకండ్‌ డోసు మాత్రమే ఇస్తున్న ప్రభుత్వం.. నాలుగు రోజులుగా అది కూడా వేయడం లేదు. 


గడువు పెంచడంలోనూ  అయోమయం

కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ టీకాల్లో మొదటి డోస్‌ తీసుకున్న వారందరూ నాలుగు వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు. ఆ తర్వాత కోవాగ్జిన్‌ కొరత ఏర్పడడంతో ఈ టీకా ఫస్ట్‌ డోసు తీసుకున్నవారు ఆరువారాల తరువాత రెండో డోసు తీసుకోవాలని సూచించారు. కోవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారు రెండో డోసు కోసం 12 వారాలు ఆగాల్సిందేనని అధికారులు ప్రకటించారు. ఇలా రోజుకో విధానాన్ని అమలులోకి తీసుకురావడంతో జనంలో అయోమయం, అసహానం కనిపిస్తోంది. 

Updated Date - 2021-05-19T05:28:01+05:30 IST