ప్రతిఒక్కరూ భక్తిమార్గంలో నడవాలి

ABN , First Publish Date - 2021-12-20T05:11:48+05:30 IST

ప్రతిఒక్కరూ భక్తిమార్గంలో నడవాలని పండరిపూర్‌ అంబాదాస్‌ మహరాజ్‌ అన్నారు.

ప్రతిఒక్కరూ భక్తిమార్గంలో నడవాలి
దత్తాత్రేయస్వామి ఆలయం వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్న దృశ్యం

నాగల్‌గిద్ద, డిసెంబరు 19 : ప్రతిఒక్కరూ భక్తిమార్గంలో నడవాలని పండరిపూర్‌ అంబాదాస్‌ మహరాజ్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన నాగల్‌గిద్దలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. ఈ ముగింపులో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు నగేష్‌ షెట్కార్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు శ్రీనివా్‌స హాజరై పూజలు నిర్వహించారు. వారీకార్‌ భజన బృందం సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

ఘనంగా దత్తాత్రేయస్వామి బ్రహ్మోత్సవాలు

హత్నూర, డిసెంబరు 19 : హత్నూర మండల పరిధిలోని మాధుర గ్రామ శివారులో గల దత్తాత్రేయస్వామి బ్రహ్మోత్సవాలు మూడవరోజైన ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సామూహిక సత్యనారాయణ వ్రతాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు సోమన్నగారి రవీందర్‌రెడ్డి దత్తాత్రేయస్వామిని దర్శించుకున్నారు. నాయకులు సందీప్‌, కృష్ణ,  సుజాత ఉన్నారు. 

పెద్దశంకరంపేట : దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా పెద్దశంకరంపేటలోని మాణిక్‌ ప్రభు మందిరంలో ఆదివారం అన్నదానం నిర్వహించారు. ఆలయ పూజారులు రాయల క్రిష్ణశర్మ, మహే్‌షశర్మ, వేదపండితుల మంత్రోశ్ఛరణల మధ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. శనివారం రాత్రి దత్తాత్రేయస్వామిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు, పల్లకీసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేశ్వర్‌, కోయిలకొండ నర్సింహులు, గాండ్ల శేఖర్‌, గాండ్ల శ్రీనివాస్‌, విశ్వనాథం పాల్గొన్నారు. 

ఝరాసంఘం: ఝరాసంగంలోని దత్తగిరి ఆశ్రమానికి కర్ణాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. 21 యజ్ఞ గుండాల వద్ద దంపతులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆశ్రమ పీఠాధిపతి 108 వైరాగ్య శిఖామణి అవదూత మహరాజ్‌ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-12-20T05:11:48+05:30 IST