ఆంజనేయుల కుటుంబాన్ని పరామర్శించిన ఈటెల రాజేందర్

ABN , First Publish Date - 2021-12-26T20:16:45+05:30 IST

సీఎం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఆంజనేయులు కుటుంబాన్ని...

ఆంజనేయుల కుటుంబాన్ని పరామర్శించిన ఈటెల రాజేందర్

సిద్దిపేట జిల్లా:  సీఎం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఆంజనేయుల కుటుంబాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ పరామర్శించారు. రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు ఐదు నిమిషాల పాటు నీటిలో మునిగి ఉండగలడని అన్నారు. అలాంటి వ్యక్తి ఎలా చనిపోయాడో తేల్చాలన్నారు. ఇవాళ పోలీస్ పహారతో బెదిరించవచ్చు కానీ... తెలంగాణ సమాజం ఏ విధంగా స్పందించాలో అలా స్పందిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఉంటే రక్షణ ఉంటుందని భావించిన ప్రజలకు ఈ చర్య కళ్ళు తెరిపించిందన్నారు. ఈ ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత ప్రజలకు రక్షణ కరువైందని, ఇంతకు ముందు పోలీస్ నిర్బంధాన్ని చవిచూడని ఈ ప్రాంతం నిత్యం పోలీసుల దౌర్జన్యాన్ని చూడాల్సి వస్తుందన్నారు. కేవలం చావు ఖర్చుల కోసం యాభై వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సిగ్గు చేటని ఈటెల రాజేందర్ మండిపడ్డారు.

Updated Date - 2021-12-26T20:16:45+05:30 IST