ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-11-10T04:48:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి

దుబ్బాక, నవంబరు 9 : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌, తిమ్మాపూర్‌, హబ్షీపూర్‌, పోతరెడ్డిపేట, నిజాంపేట, ఎనగుర్తి, ఆకారం, గంభీర్‌పూర్‌ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టీపీటీఎఫ్‌ సభ్వత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో పనిచేసిన స్కావెంజర్లను తొలగించడంతో పాఠశాలల్లో అపరిశుభ్రత నెలకొన్నదన్నారు. తక్షణమే స్కావెంజర్ల నియామకం చేపట్టి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అలాగే సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని వర్తింపజేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలను చేపట్టాలని, మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నర్సింహారెడ్డి, టీపీటీఎఫ్‌ దుబ్బాక మండలాధ్యక్షుడు వెంకట్‌, కార్యదర్శి మార్కండేయ, ప్రధాన కార్యదర్శి మహేందర్‌, నాయకులు సతీ్‌షరెడ్డి, రాములు, భూమయ్య, మధుసూదన్‌రెడ్డి, నరేష్‌, చక్రపాణి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-10T04:48:18+05:30 IST