విద్యుత్ హైవోల్టేజితో గృహోపకరణాలు దగ్ధం
ABN , First Publish Date - 2021-01-03T05:11:20+05:30 IST
విద్యుత్ హైవోల్టేజీతో అల్లాదుర్గం మండల కేంద్రంలో పలు కాలనీల్లో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి.
కాలిపోయిన టీవీ, బల్బులను చూపుతున్న గ్రామస్థులు
అల్లాదుర్గం, జనవరి 2: విద్యుత్ హైవోల్టేజీతో అల్లాదుర్గం మండల కేంద్రంలో పలు కాలనీల్లో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఎస్‌బీఐలో కంప్యూటర్ సీపీయూలు కాలిపోయాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 1, 2, 3 వార్డుల్లో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా హైవోల్టేజీ కరెంటు సరఫరా అయ్యింది. దీంతో పలు గృహాల్లో విద్యుత్ బల్పులు పేలిపోయాయి. ఫ్రిజ్‌లు, టీవీలు, ఎలకా్ట్రనిక్ సామగ్రి కాలిపోయాయి. స్థానికులు అప్రమత్తమై ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద విద్యుత్ సరఫరాను నిలపివేశారు. గృహోపకరణాలు కాలిపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.