ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
ABN , First Publish Date - 2021-12-31T17:06:30+05:30 IST
ఉమ్మడి చేర్యాల, మద్దూరు మండలాల ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడిగా..

చేర్యాల, డిసెంబరు 30: ఉమ్మడి చేర్యాల, మద్దూరు మండలాల ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడిగా మంతెన చంద్రారెడ్డి, కార్యదర్శిగా ఆర్.నవీన్ ఎన్నికయ్యారు. గురువారం చేర్యాలలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. గౌరవాధ్యక్షుడిగా కరెడ్ల మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా బేజాజి అంజిరెడ్డి, ఎండి. సలీ, తాళ్లపల్లి రాజు, సహాయ కార్యదర్శిగా నందు, కోశాధికారిగా మలిపెద్ది బాలలింగం, సలహాదారుడిగా కర్ర చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. మంతెన చంద్రారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పాటుపడతానన్నారు.