వృద్ధులను ప్రేమతో చూసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-14T05:45:19+05:30 IST

వృద్ధులను ప్రేమతో చూసుకుంటేనే జన్మ సార్థమవుతుందని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ పేర్కొన్నారు.

వృద్ధులను ప్రేమతో చూసుకోవాలి
దౌల్తాబాద్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌

ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ 

రాయపోల్‌/తొగుట, అక్టోబరు 13 : వృద్ధులను ప్రేమతో చూసుకుంటేనే జన్మ సార్థమవుతుందని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మామిడి మోహన్‌రెడ్డితో కలిసి దౌల్తాబాద్‌లో వృద్ధులకు దుస్తులు, చేతికర్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రణం శ్రీనివా్‌సగౌడ్‌, వెంకటేశ్వరశర్మ, జడ్పీటీసీలు రణం జ్యోతి, యాదగిరి జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు రహీం, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. అలాగే తొగుట మండలం కానుగల్‌ గ్రామంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుసేన్‌ పర్యటించారు. గ్రామంలో ఇటీవల మరణించిన నందారం లింగవ్వ కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా సీనియర్‌ నాయకుడు సంజీవరెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మామిడి మోహన్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, రాయపోల్‌ జడ్పీటీసీ యాదగిరి, సర్పంచులు మాధవరెడ్డిగారి ప్రేమలతాచంద్రారెడ్డి, బొడ్డు నర్సింహులు, మాజీ సర్పంచ్‌ పబ్బతి శ్రీనివా్‌సరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు కనకయ్య, మాజీ ఎంపీటీసీ పిట్ల సత్తయ్య, నాయకులు మరుపల్లి శ్రీనివా్‌సగౌడ్‌, రాంరెడ్డి, నారాగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-14T05:45:19+05:30 IST