మృతుని కుటుంబానికి ‘ఈటల’ ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2021-12-27T04:37:04+05:30 IST

మండలంలోని వరదరాజపూర్‌కు చెందిన ఆంజనేయులు(19) కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలోని

మృతుని కుటుంబానికి ‘ఈటల’ ఆర్థిక సహాయం
ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఈటల రాజేందర్‌

మర్కుక్‌ : మండలంలోని వరదరాజపూర్‌కు చెందిన ఆంజనేయులు(19) కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలోని బావిలో పడి మృతిచెందిన విషయం విధితమే. ఆదివారం హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మృతుని కుటుంబాన్ని పరామర్శించి రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. మృతుని కుటుంబానికి  అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం పొలిటికల్‌ బ్యూరో సభ్యుడు లింగ సత్యనారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్‌ గుప్తా, ముదిరాజ్‌ యువజన ప్రధాన కార్యదర్శి కుంట సత్యం, కోశాధికారి స్వామి, శ్రీశైలం, చంద్రం, నర్సింహులు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T04:37:04+05:30 IST