శివారు గ్రామాల్లో వసతుల కల్పనకు కృషి
ABN , First Publish Date - 2021-12-27T04:40:07+05:30 IST
క్రమంగా శివారు గ్రామాలకు విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న అన్నారు.

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, డిసెంబరు 26 : క్రమంగా శివారు గ్రామాలకు విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న అన్నారు. ఆదివారం పటాన్‌చెరులో ఏపీఆర్ ప్రాజెక్టు ప్రవీణ్‌గ్రాండియో వినియోగదారులకు గృహాలను అప్పగించే కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పట్టణం క్రమంగా గ్రామాలకు విస్తరిస్తోందన్నారు. పెరుగుతున్న జనావాసాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం పెద్ద సవాలుగా మారిందని చెప్పారు. కిష్టారెడ్డిపేట బీరంగూడ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. ఏపీఆర్ గ్రూపు ఎండీ ఆవుల కృష్ణారెడ్డి, డైరెక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ఆఽధునిక వసతులతో నాణ్యమైన నివాసాలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమన్నారు. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ విస్తరణలో హెచ్‌ఎండీఏ పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ ఆర్టి్‌స్టలు కెవ్వు కార్తీక్, నాగి, షబీనా, రాజమౌళి చేసిన హాస్య స్కిట్లు, వెంట్రిలాక్విజం, స్టాండప్ కామెడీలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, పట్టణ నాయకులు పాల్గొన్నారు. గోమాతను కాపాడుకునే బాధ్యత ప్రతిఒక్కరిదని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. బీరంగూడ గోశాల ఏర్పాటు చేసి 11 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం వార్షికోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీకృష్ణ ఆలయంలో గోపూజలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం ప్రారంభించి మాట్లాడారు. 11 ఏళ్లుగా గోశాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గోశాల నిర్వహణకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. గోశాల నిర్వాహకులు ఏనుగు దామోదర్‌రెడ్డి, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పనగేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం : ఎమ్మెల్యే
రామచంద్రాపురం, డిసెంబరు 26 : ఆత్మరక్షణకు తైౖక్వాండో దోహదపడుతుందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం రామచంద్రాపురం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్లో టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా పదవ తైక్వాండో ఛాంపియన్‌షి్‌ప పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. పిల్లలకు చిన్ననాటి నుంచి తైక్వాండో లాంటి క్రీడల్లో తర్ఫీదు ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు డి.సతీ్‌షగౌడ్, కార్పొరేటర్ కుమార్‌యాదవ్, ఎల్లయ్య, ప్రమోద్‌గౌడ్ పాల్గొన్నారు.