డ్రైనేజీ కాదు డివైడర్!!
ABN , First Publish Date - 2021-03-05T06:12:13+05:30 IST
ఈ చిత్రాలను చూసి కొత్తగా నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీ అనుకుంటే పొరబడినట్లే ! ఇది సదాశివపేట మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారి మధ్యలో నిర్మించిన డివైడర్. పట్టణంలో 65వ జాతీయ రహదారిపై గొల్లగూడెం బైపాస్ రోడ్డు నుంచి ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్ బైపాస్ రోడ్డు వరకు రూ.5 కోట్లతో ఈ పనులను చేపట్టారు. డివైడర్ను రాతితో నిర్మించాల్సి ఉండగా రోడ్డు మధ్యలో డ్రైనేజీలను తలపించేలా నిర్మించారు.
ఈ చిత్రాలను చూసి కొత్తగా నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీ అనుకుంటే పొరబడినట్లే ! ఇది సదాశివపేట మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారి మధ్యలో నిర్మించిన డివైడర్. పట్టణంలో 65వ జాతీయ రహదారిపై గొల్లగూడెం బైపాస్ రోడ్డు నుంచి ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్ బైపాస్ రోడ్డు వరకు రూ.5 కోట్లతో ఈ పనులను చేపట్టారు. డివైడర్ను రాతితో నిర్మించాల్సి ఉండగా రోడ్డు మధ్యలో డ్రైనేజీలను తలపించేలా నిర్మించారు. ఈ పనుల్లోనూ నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అప్పుడే డివైడర్లకు బీటలు వారుతున్నాయి. ప్రారంభానికి ముందే డివైడర్ పొడవునా పెచ్చులూడి పోతుండడం స్పష్టంగా కనబడుతోంది. దీనికి ప్లాస్టరింగ్ చేయకుండానే రంగురంగుల పెయింటింగ్వేసి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పనులను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్ శాఖ మాత్రం నిద్ర మత్తులో ఉంది.
- సదాశివపేట, మార్చి 4