డీఎంహెచ్‌వో కార్యాలయ తరలింపు షురూ
ABN , First Publish Date - 2021-10-30T04:40:44+05:30 IST
సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ నిర్మాణం నేపథ్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్ కళాశాల నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ఖాళీచేసి డీఎంఈకి అప్పగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జీ
సంగారెడ్డిఅర్బన్, అక్టోబరు 29: సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ నిర్మాణం నేపథ్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్ కళాశాల నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ఖాళీచేసి డీఎంఈకి అప్పగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జీ ప్లస్ 3 సామర్థ్యంతో నిర్మించిన ఈ భవనంలో 2007 నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయం కొనసాగుతున్నది. ఖాళీ చేయాలని ఆదేశాలు రావడంతో డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని జిల్లా ఆస్పత్రి ఉద్యోగుల క్వార్టర్స్‌లోకి మారుస్తున్నారు. కార్యాలయంలోని పాత రికార్డులు, ఫైల్స్, పనికిరాని సామగ్రిని సదాశివపేటలోని సీహెచ్‌సీ ఆస్పత్రి పాతభవనంలోని తరలిస్తున్నారు. వారం రోజుల్లో తరలింపు ప్రక్రియను పూర్తిచేసి భవనాన్ని అప్పగిస్తామని అధికారులు తెలిపారు. అయితే తాత్కాలిక డీఎంహెచ్‌వో కార్యాలయ భవన మరమ్మతు పనులను అడిషనల్ కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం పరిశీలించారు.