అంబేడ్కర్ స్టేడియంలో అథ్ల్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపిక
ABN , First Publish Date - 2021-10-26T04:26:21+05:30 IST
సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్డేడియంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు.

సంగారెడ్డి అర్బన్, అక్టోబరు 25: సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్డేడియంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. అండర్ 10, 12, 14 బాలురు, బాలికల విభాగంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎనిమిది మంది ఎంపికయ్యారు. విజేతలకు పతకాలను అందజేశారు. వీరు ఖమ్మంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జావీద్‌అలీ అధ్యక్షతన జరిగిన పోటీల్లో స్విమ్మింగ్ కోచ్ శ్రీనివా్‌సగౌడ్, క్రీడాకారులు పాల్గొన్నారు.