ఐసోలేషన్‌లోని కొవిడ్‌ రోగులకు ఆహారం పంపిణీ

ABN , First Publish Date - 2021-05-06T05:19:47+05:30 IST

జహీరాబాద్‌లో కొవిడ్‌ భారిన పడి ఐసోలేషన్‌ (ఇంట్లోనే)ఉండి చికిత్స చేయించుకుంటున్న వారికి నామసుభద్రమ్మ ట్రస్టు, ప్రాణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సభ్యులు మంగళవారం ఆహారం, ఇతరత్రా సరుకులను సుమారు 15 కుటుంబాలకు అందజేశారు.

ఐసోలేషన్‌లోని కొవిడ్‌ రోగులకు ఆహారం పంపిణీ
ఆహారాన్ని ప్యాక్‌ చేస్తున్న ట్రస్టు సభ్యులు

జహీరాబాద్‌, మే 5: జహీరాబాద్‌లో కొవిడ్‌ భారిన పడి ఐసోలేషన్‌ (ఇంట్లోనే)ఉండి చికిత్స చేయించుకుంటున్న వారికి నామసుభద్రమ్మ ట్రస్టు, ప్రాణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సభ్యులు మంగళవారం ఆహారం, ఇతరత్రా సరుకులను సుమారు 15 కుటుంబాలకు అందజేశారు. రెండు రోజలుగా ట్రస్టుసభ్యుల ఆధ్వర్యంలో ఐసోలేషన్‌లో ఉన్నవారికి మధ్యాహ్నం, సాయంత్రం రెండుపూటలా భోజనాన్ని అందజేస్తున్నట్లు ట్రస్టు సభ్యుడు నామరవికిరణ్‌ చెప్పారు.

Updated Date - 2021-05-06T05:19:47+05:30 IST