సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2021-11-01T04:40:38+05:30 IST

అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పలువురికి జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ ఆదివారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

తూప్రాన్‌ (మనోహరాబాద్‌)/కొండాపూర్‌, అక్టోబరు 31 : అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పలువురికి జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ ఆదివారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. మనోహరాబాద్‌లోని జడ్పీ చైర్‌పర్సన్‌ క్యాంపు కార్యాలయం వద్ద మనోహరాబాద్‌ మండలం తుపాకులపల్లికి చెందిన గాంతీ యాదమ్మకు రూ.43 వేలు, మనోహరాబాద్‌కు చెందిన సత్కురి అక్షిత్‌నారాయణకు రూ.44 వేల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మంచ శ్రీరామ్‌, పాండు, అశోక్‌, కుమార్‌, శివ్వయ్య పాల్గొన్నారు. కొండాపూర్‌ మండలంలోని పదిమంది లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ రూ.3.82 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు.

Updated Date - 2021-11-01T04:40:38+05:30 IST