బాచేపల్లిలో కుక్కల దాడిలో జింక మృతి

ABN , First Publish Date - 2021-12-08T05:01:53+05:30 IST

జనావాసంలోకి వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ సంఘటన మండలంలోని బాచేపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది.

బాచేపల్లిలో కుక్కల దాడిలో జింక మృతి

కల్హేర్‌, డిసెంబరు 7: జనావాసంలోకి వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ సంఘటన మండలంలోని బాచేపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది.  తెల్లవారు జామున ఓ జింక అటవీ ప్రాంతం నుంచి బాచేపల్లి గ్రామంలోకి రాగా వీధి కుక్కలు వెంటపడి జింకను చంపివేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులకు సమాచారమందించగా వారు వచ్చి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అటవీ జంతువులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు వెంటనే తమకు సమాచారమందించాలని గ్రామస్థులకు సూచించారు. 

Updated Date - 2021-12-08T05:01:53+05:30 IST