ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలక భూమిక డీలర్లదే
ABN , First Publish Date - 2021-10-30T04:44:10+05:30 IST
రేషన్ డీలర్లంటే పేదల ఆకలి తీర్చేవారని, ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలకభూమిక డీలర్లదేనని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
రేషన్ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మారెడ్డి
జోగిపేట, అక్టోబరు 29: రేషన్ డీలర్లంటే పేదల ఆకలి తీర్చేవారని, ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలకభూమిక డీలర్లదేనని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చందంపేట శివార్లలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జిల్లా రేషన్‌డీలర్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ఒకరో ఇద్దరో అన్యాయం చేసిన సందర్భాలు ఉన్నా.. ఈ పాస్ విధానం వచ్చాక నేడు ఏ ఒక్క డీలరూ అక్రమాలకు పాల్పడడం లేదని కితాబునిచ్చారు. రాష్ట్రంలోని పేదలందరికీ బియ్యం అందిస్తున్న డీలర్లు.. తమ సమస్యలను తీర్చుకునే స్థితిలో లేరన్నారు. వారి సంఘం గౌరవాధ్యక్షురాలిగా తనను ఎన్నుకున్న తర్వాత డీలర్లంతా తన కుటుంబసభ్యులు అయిపోయారన్నారు. వారి సమస్యలను తీర్చే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. కమిషన్ పెంపు, ఇన్సూరెన్స్, కారుణ్య నియామకాలు, లీగల్ హెయిర్ వయసు పరిమితి 55 ఏళ్లకు పెంపు తదితర సమస్యలను తాను సీఎం దృష్టికి తీసుకెళ్లానని, వాటిని ప్రాధాన్య క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. త్వరలోనే 33 జిల్లాల నుంచి డీలర్ల ప్రతినిధులను కేసీఆర్ వద్దకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
డీలర్ల పాత్ర అమోఘం : ఎమ్మెల్యే క్రాంతికిరణ్
. ప్రజాపంపిణీ వ్యవస్థలో డీలర్ల పాత్ర అమోఘమైనదని, కరోనా సమసయంలో డీలర్ల పాత్ర అభినందనీయమని అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కొనియాడారు. డీలర్లలో చాలామంది రాజకీయాల్లో ఉండి వివిధ పార్టీలకు పనిచేశారన్నారు. తాము మాత్రం రాజకీయాలకు అతీతంగా, డీలర్ల సమస్యలనుపరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని హామీనిచ్చారు. న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఎప్పుడైనా తన ఇంటి తలుపు తట్టొచ్చని ఆయన డీలర్లకు సూచించారు. అనంతరం జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తనవంతు సహాయం అందిస్తానన్నారు. అఖిల భారత చవక ధరల దుకాణాల సంఘం అధ్యక్షుడు పుష్పరాజ్ కాకా, ఈ సమ్మేళనానికి అధ్యక్షతన వహించిన రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు మా ట్లాడారు. తమ సమస్యలను తీర్చే సత్తా పద్మాదేవేందర్‌రెడ్డికి ఉందన్నారు. స మస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమయితే కేసీఆర్‌కు క్షీరాభిషేకం చేస్తామని, జిల్లాలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పక్షాన నేరుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వారు హామీ ఇచ్చారు. సమ్మేళనంలో జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూ ర్తి, కోశాధికారి అల్లె మహేష్, జిల్లాలోని రేషన్ డీలర్లు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
