పంట వివరాల నమోదులో నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2021-02-05T05:51:31+05:30 IST

వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర సందర్శన చేయకుండా పంటల వివరాలను నమోదు చేయడంతో చిరుధాన్యాలను సాగుచేసే రైతులకు అన్యాయం జరుగుతున్నదని డీడీఎస్‌ డైరెక్టర్‌ పీవీ సతీష్‌ పేర్కొన్నారు.

పంట వివరాల నమోదులో నిర్లక్ష్యం తగదు
చిరుధాన్యాల సాగు విధానాన్ని పటం రూపంలో వివరిస్తున్న డీడీఎస్‌ మహిళా రైతులు

జహీరాబాద్‌, ఫిబ్రవరి 4: వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర సందర్శన చేయకుండా పంటల వివరాలను నమోదు చేయడంతో చిరుధాన్యాలను సాగుచేసే రైతులకు అన్యాయం జరుగుతున్నదని డీడీఎస్‌ డైరెక్టర్‌ పీవీ సతీష్‌ పేర్కొన్నారు. గురువారం పస్తాపూర్‌లోని డీడీఎస్‌ కార్యాలయంలో అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్‌ పరిసరప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు ఎక్కువగా జరుగుతుందని, పంట వివరాలను నమోదు చేయకపోవడంతో జాతీయస్థాయిలో గుర్తింపు ఉండడం లేదని విమర్శించారు. ఆనంతరం సెంటర్‌ఫర్‌ ఎకనామిక్స్‌, సోషల్‌ స్టడీస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు క్షేత్ర సందర్శన చేసి పంటల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింగరావు మాట్లాడుతూ కిందిస్థాయి సిబ్బంది పొరపాట్లు చేస్తే రైతులు వ్యవసాయశాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. ఉద్యానవనశాఖ అధికారి సునీత, ప్రొఫెసర్‌ దయాకర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-05T05:51:31+05:30 IST